తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి ఎస్సైగా పులిచెర్ల ఉదయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్ కు చెందిన ఉదయ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా లోని బజహత్నూర్ ఇచ్చోడా,నిజామాబాద్ జిల్లా లోని రెంజల్ స్టేషన్లో ఎస్ఐ గా పనిచేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ ధర్మపురి స్టేషన్ పరిధిలోని నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ధర్మపురి ఆలయానికి వచ్చే భక్తులకు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ని నియంత్రిస్తానని ఆయన తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ ని సిబ్బంది సన్మానించారు
