రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

ఖరీప్ సీజన్ నుంచి రైతు భరోసా కింద ఎకరానికి 7500

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ ప్రభ ( మెదక్ ): కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రలో భాగంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిటీ సిఫారసుపై మొట్టమొదటి సంతకం చేస్తామని రాహుల్ గాంధీ తెల్పడం రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపి ప్రభుత్వం రైతులపై కన్నెర చేయడమే కాకుండా రైతులను చిత్రహింసలు పెడుతూ, రైతుల ఉసురుపోసుకుంటున్న నరేంద్రమోడి, అమిత్ షాలు గంగలో కొట్టుకుపోతారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పదేండ్లుగా రైతులకు కనీసం మద్ధతు ధరను ప్రకటించడమే కాకుండా 2014 సంవత్సరం నుండి మద్ధతు ధర రూ.2203  చెల్లించడంతో రైతులు 800 రూపాయలు ప్రతి సీజన్ కు నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్, బిజేపి పార్టీతో రహస్య ఒప్పందాలు చేసుకొని రైతులను నట్టేట ముంచారని విమర్శించారు. కాగా రైతులపై జరిపిన దాడులకు నిరసనగా కార్మిక సమ్మే గ్రామీణ బంద్ లో కిసాన్ సెల్ పాల్గొంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాపన్నపేట ఎంపిపి చందనా ప్రశాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మెదక్ మండల అధ్యక్షులు శంకర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్సాబ్, బొజ్జ పవన్, దాయర రవి, శ్రీనివాస్ చౌదరి, నాగిరెడ్డి, అక్బర్, సూఫీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

.