ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారా
ఎంపీగా ఐదేళ్లలో జిల్లాకు చేసింది ఏమీ లేదు
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); ప్రజలను మోసం చేసేందుకే ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తున్నారని తంగళ్ళపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజబింకార్ రాజన్న ఆరోపించారు. గురువారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పాద యాత్ర పేరుతో ఓట్ల యాత్ర చేస్తున్న బండి సంజయ్ కి ఓటమి తప్పదని, రెట్టించిన ఉత్సాహంతో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటుందని రాజన్న అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడమే పని పెట్టుకున్న నీకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని, మమ్ములను విమర్షించడం కాదు మీరు చేసిన ఏదైనా పని ఉంటే చెప్పి ఓట్లు అడగాలని,
జాతీయ నాయకుల చెప్పులు మోసే బండి సంజయ్ కేటిఆర్ పేరు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా కోట్లాది రూపాయలు సంపాదించి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది,కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు గా గెలిచి గత ఐదు సంవత్సరాల కాలంలో గ్రామాలకు కాదు కదా మండల కేంద్రాలకు కూడా రాని నీవు
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని పాద యాత్ర పేరిట ఓట్ల కోసం తంటాలు పడుతున్నావు.
ఏ గ్రామానికి కూడా గత ఐదు సంవత్సరాల లో నిధులు ఇవ్వని మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు.ఉపాధి హామీ నిధులను కూడా నీవు ఇచ్చిన నిధులు గా చెప్పుకోవడం సిగ్గు చేటు.
కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన మీకు పార్లమెంటు ఎన్నికలలో కూడా ఓటమి తప్పదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు, వైస్ యంపిపి జంగిటి అంజయ్య, సారంపల్లి మాజీ సర్పంచ్ కొయ్యడ రమేష్, యూత్ నాయకులు చిరంజీవి, దేవెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.