సంత్ సేవాలాల్ దేశం గర్వించదగ్గ సంఘ సేవకులు : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ

తెలంగాణ ప్రభ ( శేరిలింగంపల్లి ): దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారా, లంబాడాల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్‌  సేవాలాల్‌ మహరాజ్‌ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో జరిగిన జయంతి వేడుకలలో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని నివాళులర్పించి మాట్లాడారు. సేవాలాల్ చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిందన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని, గిరిజనుల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన నిత్య కృషి వలుడని, గిరిజనులు మంచి చదువులు చదువుకొని అన్ని రంగాలలో  అభివృద్ధి చెందలని ఆశించిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్,  అంజద్ పాషా, మున్య నాయక్, గోపాల్ నాయక్, సుభాష్ నాయక్, అమర్ సింగ్ నాయక్, వెంకట్ రావు నాయక్, బాషా నాయక్  పాల్గొన్నారు.

.