నిరుపేదల ఆకలి తీర్చడమే కోరుట్ల సేవాదల్ లక్ష్యం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అన్నం కూరలు మిగలగా విషయం తెలుసుకున్న కోరుట్ల సేవాదల్ అధ్యక్షులు పుప్పాల నాగరాజు అట్టి అన్నం కూరలను పట్టణంలోని సుమారు 150 మందికి పంపిణీ చేసి వారి ఆకలి తీర్చడం జరిగింది.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఎక్కడైనా ఫంక్షన్లలో అన్నం కూరలు మిగిలితే వృధా చేయకుండా నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన కోరారు.

మేము అందుబాటులో లేనిపక్షంలో మీరే స్వయంగా పంపిణీ చేసి నిరుపేదల ఆకలి తీర్చాలని ఆయన కోరారు.

.