అంగన్వాడి సెంటర్లో అక్షర అభ్యాసం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంగన్వాడి సెంటర్ 1 సాయిరాం కాలనీ  3 వ వార్డులో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా వార్డ్ కౌన్సిలర్ మోర్తాడు లక్ష్మీనారాయణ  చేత పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ తుమ్మనపెల్లి శోభారాణి, ఆయా లక్ష్మి, ఆశా వర్కర్ శారద, పిల్లల తల్లిదండ్రులు మరియు గర్భిణులు పాల్గొన్నారు.

.