పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే..

భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు జోగినిపల్లి రంగారావు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జోగినపల్లి రంగారావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం  కిసాన్  సంఘ్ సభ్యత నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే రైతులను సంఘటితం చేస్తూ రైతు సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం దేశవ్యాప్తంగా పోరాడుతున్న అతిపెద్ద రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ అని అన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ సంఘం యొక్క సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుందని, దేశంలోనే అత్యధిక రైతులతో సభ్యత్వం కలిగిన సంఘం భారతీయ కిసాన్ సంఘ్  అని తెలిపారు. రైతులకు ఏ సమస్యలొచ్చిన వాళ్లకు వెన్నంటే ఉండి పరిష్కరించడంలో ముందు వరసలో ఉన్నామన్నారు. ఈ సభ్యత్వం ద్వారా రైతులందరినీ సంఘటితం చేస్తూ వారి సమస్యల పట్ల మరింత పోరాటం, సమస్యల సాధన దిశగా వెళ్లేందుకు ఈ సభ్యత్వం ఎంతో బలం చేకూరుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల, నియోజకవర్గ , జిల్లాల వారీగా కమిటీలు వేయడం జరుగుతుందని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని రైతు సంఘానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులి లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి బియ్యం కార్ శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు నిమ్మ నారాయణరెడ్డి, మార్పు రాజిరేడ్డి, గంట కార్తీక్ గౌడ్, మర్రి శ్రీనివాస్ రేడ్డి, కోనేటి సాయిలు, వంగ బాపురెడ్డి, నాంపల్లి ప్రశాంత్, మందటి రాము రైతులు తదితరులు పాల్గొన్నారు.

.