తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ పరిధిలో వాగ్దేవి ప్రవేట్ స్కూల్ ను ప్రారంభించిన గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు ఈ సందర్భంగా స్కూలు యాజమాన్యం మద్దెల సాయిబాబాను అభినందించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యతోనే అందరి జీవితాలు బాగుపడతాయని ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. వాగ్దేవి స్కూల్ యజమాన్యం పేద విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కస్తూరి బాల్రాజ్, కమలాకర్, ప్యాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ జనరల్ సెక్రెటరీ నవాబ్ భాయి, అజయ్ గుప్తా, మురళీకృష్ణ , చిన్న చౌదరి, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
