ఎఫ్ఎల్సీలో మాక్ పోలింగ్ పూర్తి

మెదక్ జిల్లా ఎన్నికల అధికారి  కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( మెదక్ ): పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా, మంగళవారం గుర్తిపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో  మాక్ పోలింగ్ నిర్వహణ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబందల మేరకు ఎఫ్ఎల్ సి నిర్వహించామని, ఎఫ్ ఎల్ సి లో బాగంగా గుర్తిపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహణ పూర్తి  చేశామన్నారు. మాక్ పోలింగ్ లో ఈవీఎం, వీవీ ప్యాట్ ల ఓట్లు మాక్ పోలింగ్ లో వేసిన ఓట్ల లెక్కలు సరిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు రమేష్, మెదక్ ఆర్డీఓ అంబదాసు రాజేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ సూపర్ఇండెంట్ హార్డిప్ సింగ్, రాజకీయ పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

.