తెలంగాణ ప్రభ, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి: గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ మ్యాథమెటిక్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ విద్యార్థుల చేత ప్రదర్శింపబడింది, దాదాపు 100 మంది విద్యార్థులు మ్యాథ్స్ ఈజీ అనే కాన్సెప్ట్ పైన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాథ్స్ బోధించే టీచర్లందరినీ చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, హెడ్మాస్టర్ తిరుపతి గౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ శాలువాలతో ఘనంగా సత్కరించారు.
