తెలంగాణ ప్రభ, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి: స్థానిక కృష్ణవేణి విద్యాసంస్థలో శ్రీ రామానుజం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదిన సందర్భంగా శుక్రవామిక్కడ గణిత దినోత్సవ కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంజుల శ్రీనివాస్ రెడ్డి రామానుజం చిత్రపటానికి పూలమాలను వేసి తదనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. విద్యార్థులు గణిత దినోత్సవoను పురస్కరించుకొని విద్యార్థులు రామానుజన్ యొక్క విశిష్టతను తెలియజేయడము జరిగినది. కార్యక్రమంలో విద్యార్థులoదరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క సృజనాత్మకతను బయటికి తీసి కొన్ని గణిత సంబంధించిన ప్రయోగాత్మకతమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంజుల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి పిల్లలు గణితం అంటే భయపడకుండా ఇష్టంతోనే చదివితే మనము గణితంలో కూడా మంచి మార్కులతో మంచి ఉన్నత శిఖరాలను చేరవచ్చు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ప్రతి సబ్జెక్టులో అభిరుచి చూపించి ఉన్నత స్థాయిలో చేరుకోగలరని కోరుతున్నాను.ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారానే మనం విద్యార్థుల యొక్క సృజనాత్మకతను బయటికి తీయవచ్చు అని తెలియజేయడం జరిగినది. మరియు ఉపాధ్యాయ బృందమును ,విద్యార్థులను అభినందించి కార్యక్రమానికి ముగించడము జరిగినది. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి పాఠశాల యజమాన్యం మరియు విద్యార్థుల పోషకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాల్ని విజయవంతం చేయడం జరిగినది.
