అన్ని గ్రూపుల్లో అత్యధిక ఉత్తీర్ణత
విజేతలను అభినందించిన మహతి యాజమాన్యం
తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): పట్టణంలోని మహతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో జిల్లాలోనే ఉన్నత ఫలితాలను సాధించి సత్తా చాటారు. శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వెల్లడించింది. ఇందులో స్థానిక మహతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు అన్ని గ్రూపుల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. అంతేకాదు ఆయా గ్రూపుల్లో గరిష్ట మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. బీఎస్సీ ఎంపీసీ గ్రూప్లో శాంతినగర్కు చెందిన ఎలిగేటి అపర్ణ 9.44 జీపీఏ సాధించి డిస్ట్రిక్ట్ టాపర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. డి. రమ్య 2,08, ఎం జ్యోతి 8.89, బి. శరణ్య 8.36, ఎ. బబిత 8.31, ఎ. నిహారిక 8.22, జి. మలిత 8.16 జీపీఏ సాధనతో ముందు వరుసలో నిలిచారు. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎస్. రమ్య 8.98, బి. దీపిక 8.94 జీపీఏతో తొలి స్థానాల్లో నిలిచారు. ఎస్ నేహ 8,72, జి. వాణి, 8.60, 2 వీణ 8.49, బి. అఖిల 8:46, బి శ్రీజ 8.44, ఎ. సౌజన్య 8:38, డి అఖిల 8.46, ఎ. సౌజన్య 8.38, డి అఖిల 8.36, జి శ్రావణి 8.28, కే. అఖిల, వి. మానస 8.23, కే. రజిత 8.10. వై విజయ 8,08, ఎస్ ఇందు. 8.07, డి అర్చన 8.0 జీపీఏ తో గరిష్ట మార్కులు సాధించిన వారిలో ఉన్నారు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో రాగుల అభినయ 8.37, టి శ్రుతిలయ 8.28 జీపీఏతో అగ్ర స్థానంలో నిలిచారు. అన్ని గ్రూపుల్లో 70శాతానికి పైగా విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో కళాశాలలో శుక్రవారం అభినందన సమావేశం నిర్వహించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పుష్ప గుచ్చాలతో సత్కరించారు. ఉన్నత విద్యా రంగంలో మరింత రాణించి జీవితంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించాలని కరస్పాండెంట్ డాక్టర్ రాజు సూచించారు. విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల ప్రిన్సిపాల్ గెంట్యాల భూమేశ్, ఆధ్యాపకులు డి స్వామి, డి లక్ష్మి, శరత్ కుమార్ తదితరులున్నారు.
.