తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట):మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో గణితదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . పాఠశాల ఆవరణలో శుక్రవారం గణిత మేధావి శ్రీనివాస రామానుజ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విద్యార్థులు చతుర్విద ప్రక్రియలు ,1729 ఆకృతి ప్రదర్శన చేశారు. ఈసందర్భంగా శ్రీనివాస రామానుజ గణిత శాస్త్రంలో చూపిన ప్రతిభను కొనియాడారు. అనంతరం విద్యార్థులకు గణితంపై క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
