తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారికి బుధవారం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పంతం రవి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు మీసం లక్షణ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వము మధ్యాహ్న భోజన కార్మికు లతో వెట్టి చాకిరి చేయించుకుందని వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని మధ్యాహ్న భోజన కార్మికులకు 9 మాసాల పెండింగ్ వేతనాలు ఇప్పి టి వరకు బకాయిలో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇప్పటివరకు కూడా అప్పులు తీసుకువచ్చి వాటికి వడ్డీలు కడుతున్నారని ప్రభుత్వం ఇచ్చే ₹3,000 వాటి వడ్డీలకు కూడా సరిపోవడం లేదని కనుక నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టుకున్న విధంగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల వేతనం చెల్లించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని పెండింగులు ఉన్న బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని ప్రధానంగా కోడిగుడ్లను ఏజెన్సీల ద్వారా ప్రభుత్వమే సప్లై చేయాలని ప్రతి పాఠశాలలో వంటగదులు నిర్మించి గ్యాస్ సిలిండర్ ప్రభుత్వమే అందించాలని ఈ విషయాలన్నింటి కూడా నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మేము ఆశిస్తున్నామని ఈ విషయాలపై ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు సోమ నాగరాజు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కోకన్వీనర్ ఎడగట్ల లక్ష్మి లలిత జబేద కౌసల్య తదితరులు పాల్గొన్నారు
