ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి : సంగారెడ్డి డిఆర్ఓ నగేష్

సంగారెడ్డి డిఆర్ఓ నగేష్

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంగారెడ్డి జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా రెవిన్యూ అధికారి నగేష్  బ్యాంకర్లను కోరారు. 

మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో  బ్యాంకర్లు, జిల్లా అధికారులతో  రైతులకు రుణాల పంపిణీ,  స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి ఋణ లక్ష్య పురోగతిపై  డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని  నిర్వహించారు.  

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో  ప్రాధాన్యత, ప్రాధాన్యే తర రంగాలకు సంబంధించి జిల్లాలో రూ.7800  కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు వివిధ బ్యాంకుల ద్వారా రూ.7911.21 కోట్ల రుణాలు అందించినట్లు ఎల్ డి ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. 

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగంగా షెడ్యూల్ మేరకు జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలో   అన్ని బ్యాంకులు పాల్గొని బ్యాంకుల ద్వారా అమలవుతున్న ఆయా  పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ,అర్హులైన వ్యక్తులను పథకాలలో నమోదు చేయలని 

ఎల్ డి ఎం బ్యాంకర్లకు సూచించారు. అనంతరం నాబార్డ్ కు సంబంధించిన  2024-25 జిల్లా  పొటెన్షియల్  లింక్డ్ క్రెడిట్  ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో ఎల్డియం గోపాల్ రెడ్డి, ఆర్బిఐ  ఎజియం తాన్యా, నాబార్డ్ డిడిఎం కృష్ణ తేజ, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ప్రశాంత్, వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, ఉద్యాన శాఖ డిడి వెంకటేశ్వర్లు,

సంక్షేమ శాఖల అధికారులు, అన్ని బ్యాంకుల కంట్రోలర్లు పాల్గొన్నారు.

.