ఈనెల 20న టిడిఎస్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ 


తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఈనెల 20న ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని శాఖల  డిడిఓ లకు ఆదాయపు పన్ను, టీడీఎస్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

 20న ( బుధవారం )

ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సంగారెడ్డి, ఆందోల్ డివిజన్ల డిడిఓ లకు, మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జహీరాబాద్,

నారాయణ్ ఖేడ్ డివిజన్ ల డిడిఓ లకు సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టిడీఎస్ నిబంధనలు, ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలపై  అవగాహన కల్పిస్తారని తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమానికి పై చూపిన నిర్దేశిత సమయంలో ఆయా డివిజన్ల పరిధిలో గల అన్ని శాఖల డి డి ఓ లు   హాజరు కావాల్సిందిగా కలెక్టర్ సూచించారు.

.