చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మలను కోరిన ఏఐటీయూసీ నేతలు.
తెలంగాణ ప్రభ (హైదరాబాద్):సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఇస్తున్న 50% విద్యుత్ సబ్సిడీ యధావిధిగా కొనసాగించాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని కోరుతూ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లాల్ బహుట చేనేత కార్మిక సంఘం ( ఏఐటియుసి) నాయకులు పంతం రవి ఆధ్వర్యంలో సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశనికి లాల్ బహుట చేనేత కార్మిక సంఘం(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో హాజరై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికుల, పారిశ్రామికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వివరించారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమకు ఇస్తున్న 50% సబ్సిడీ యధావిధిగా కొనసాగించాలని, వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి పనులు సత్వరం పూర్తి చేయాలని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిలను తక్షణ విడుదల చేయాలని పథకాన్ని కొనసాగించాలని మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు లాల్ బహుట చేనేత కార్మిక సంఘం ( ఏఐటీయూసీ) నాయకులు పంతం రవి కార్యక్రమంలో అజ్జు వేణు, సుమ నాగరాజు పాల్గొన్నారు.
