సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే విధులను బహిష్కరిస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు అన్నారు. సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పైన చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 11 వ పిఆర్సి చైర్మెన్ సిఫారసు చేసిన వేతనాలు రూ.19000/- లు రూ.22900/-లు రూ.31040/- లను కనీస వేతనాలుగా నిర్ణయించి ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన కార్మికులకు 25 లక్షల ఇన్సురెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒకే రకమైన పనులు చేస్తున్న వారి మధ్య వేతన వ్యత్యాసాలు ఉండరాదని, కాంట్రాక్టు కార్మికునికి సైతం పర్మినెంట్ ఉద్యోగులతో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పునిచ్చిందన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతులలో పనిచేస్తున్న మన్సిపల్ కార్మికులందరిని తక్షణమే పర్మినెంట్ చేయాలని, అనేకమంది కార్మికులు, మ్యాన్ హోల్స్, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే సమయంలో ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . అటువంటి వారికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు యాదగిరి, సువర్ణ, సురేష్, లక్ష్మణ్, యాదగిరి, శ్రీనివాస్, నర్సింలు, సురేందర్, సంగీత, లక్ష్మీ, మల్లేశం, రాములు, శివరాజ్, ఆంజనేయులు, వేణు పాల్గొన్నారు.
.