అందించిన మెదక్ అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామానికి చెందిన పోతుల మల్లేష్ కూతురు పోతుల తేజశ్రీకి జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు వీల్ చైర్ ను అందించారు.
సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పోతుల తేజశ్రీతో పాటు తన తండ్రి పోతుల మల్లేష్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరై జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లుకు విన్నవించుకున్నారు.
శ్రీజ నడవలేని పరిస్థితిలో ఉందని ,ఆమెకు 90శాతం వైకల్యం ఉందని , పేదరికంలో ఉన్నామని సహాయం చేయమని లిఖిత పూర్వకంగా ధరఖాస్తును అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లుకు అందించారు.
పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న శ్రీజను చూసి చలించిన అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన వీల్ చైర్ అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
.