మెదక్ జిల్లా యువజనోత్సవాల పోస్టర్ విడుదల

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో):ఈనెల 22న నిర్వహించే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నిర్వహించే ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి యువతి యువకులు , కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. 

ఆధునిక యుగంలో మరుగున పడుతున్న సంప్రదాయాలను వెలికితీయాలనే ఉద్దేశంతో పాటు, యువతలో దాగి ఉన్న కలలను బయటకి తీసేందుకే ,ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 

తప్పక అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ జిల్లా యువజన మరియు  క్రీడల అధికారి నాగరాజు, డిఆర్డిఓ శ్రీనివాస్, డీపీవో సాయి బాబా, డిఇఓ రాధా కిషన్, డిడబ్ల్యుఓ  బ్రహ్మాజీ, డిఐఈఓ సత్యనారాయణ  పాల్గొన్నారు.

.