రాజన్నసిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ కి రాజీనామా చేసిన జడ్పీటిసి దంపతులు

తంగలపల్లి జడ్పీటిసి దంపతులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల జడ్పిటిసి దంపతులు పూర్మాణి  మంజుల ఆమె భర్త లింగారెడ్డి   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. వీరి రాజీనామా పత్రాన్ని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యకు పంపించామని తెలిపారు. వీరు గత 20 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీలో పనిచేయటమే కాకుండా పార్టీకి అనేక సేవలు అందించామని, పార్టీ నుండి ఎటువంటి పిలుపుకైనా న్యాయంగా కష్టపడి పని చేశామని అన్నారు. కానీ మాకు పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని, అంతేకాకుండా పార్టీలో అనేక ఒడిదోడుకులు ఎదుర్కొని తీవ్ర మనస్తాపంతో పార్టీకీ రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. అయితే ఈ రాజీనామా వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

.