తెలంగాణ ప్రభ(ధర్మపురి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామానికి చెందిన చెందరాజుల రవళి తండ్రి గంగయ్య చనిపోవడంతో ఇంటి పెద్దలు కోల్పోయిన తల్లి తన ఇంటి బరువు అంతా మోస్తూ ఇటీవల రవళి వివాహం కుదరడం వలన వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, వివాహానికి 5వేల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా గోపులాపూర్ గ్రామ ఉపసర్పంచ్ మరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి కీ 50కేజీ ల బియ్యం అందించారు. ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, మండల యూత్ అధ్యక్షులు బిర్పూర్ తిరుపతి, ఓయూ జేఏసీ చేర్మెన్ కండ్లే మదన్,గోపులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవిందుల రమణ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెంటం శ్రీధర్, బుగ్గారం పట్టణ యూత్ అధ్యక్షులు నగునూరి చిన్న నర్సగౌడ్ గైని శ్రీనివాస్,ఏలేటి శ్రీనివాస్,కండ్లే అంజి,మరిపెల్లి శేఖర్ రెడ్డి,న్యాతరి రాజన్న, గజ్జెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
