మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్.
తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): అప్పుల్లో దేశంలోనే బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే ముందున్నాయని మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన విమర్శలను తప్పు పట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడం సరికాదని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పుల్లో మునిగిపోయిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. నెలల తరబడి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఆ రాష్ట్రాల్లో ఆపుతున్నారని విమర్శించారు. అప్పులు చేశారంటూ విమర్శ చేస్తున్న వాళ్లకు జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించవలసిన అవసరం ఉందని తెలిపారు. సమావేశం అనంతరం ఇటీవల మరణించిన బిఆర్ఎస్ నాయకులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కుటుంబాన్ని, కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కొండూరి రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీ చైర్ పర్సన్ నేలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, బోల్లి రామ్మోహన్, దడిగెల శ్రావణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
.