అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

చర్ల తహసీల్దార్ అనంత రామకృష్ణ

తెలంగాణ ప్రభ  (చర్ల) : చర్ల మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చర్ల తహసీల్దార్ అనంత రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం మండలంలోని తేగడ తాలిపేరు నుంచి అక్రమ ఇ సుక తరలిస్తున్నారని సమాచారం మేరకు రేవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను తహసీల్దార్ ఆఫిస్ కు  తరలించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతుల్లేవని పేర్కొన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహించి, అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు చేపడతామని  అన్నారు.


.