తెలుగు అధ్యాపకురాలు అరుంధతికి దక్కిన గౌరవం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్న మెదక్ జిల్లా యూసుఫ్ పేట ఆరేపల్లికి చెందిన నిట్టూరి అరుంధతికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ని ప్రకటించింది. డాక్టర్ నాలేశ్వరం శంకరం మార్గదర్శకత్వంలో నిజామాబాద్ జిల్లా యక్షగానాలు - సమగ్ర అధ్యయనం అను అంశముపై పరిశోధన చేసి సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి గాను డాక్టరేట్ ప్రకటించింది.
ఈ డాక్టరేట్ ప్రకటన పట్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హుస్సేన్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల తెలుగు విభాగం ఆచార్యులు అభినందనలు తెలిపారు.
.