యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): అత్యాధునిక టెక్నాలజీ తో భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ని యశోద ఆసుపత్రిలో విజయవంతం చేసి రోగులకు పునర్జన్మ ప్రసాధిస్తున్నామని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు.శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో పల్స్ ఆసుపత్రికి యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ పట్టణానికి చెందిన జర్నలిస్ట్ కామటి కిషన్ గత రెండు మాసల క్రితం తలతిరిగి క్రింద పడిపోవడంతో స్థానికంగా ఉన్న పల్స్ ఆసుపత్రి తరలించారు. అందుబాటులో ఉన్న డాక్టర్ భాను పరీక్షించి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ బ్రెయిన్ ట్యూమర్ గా గుర్తించి సరి కొత్త టెక్నాలజీ న్యూరో నావిగేషన్ మరియు న్యూరో మానిటరింగ్ ద్వారా సర్జరీ ని విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈ సర్జరీ సమయంలో రోగికి పక్షవాతం ,నోటిమాట పడిపోవడం వంటివి సంభవించకుండా యం ఆర్ ఐ సహాయం తో చికిత్స పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఇలాంటివి మళ్ళీ సంభవించకుండా ప్రత్యేక కోర్సు రోగికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ రావడంతో ఎమర్జెన్సీ కేసులు గతంలో కంటే 90 శాతం మంది ప్రాణాలు కాపాడుతున్నట్లు వివరించారు. యశోద ఆసుపత్రిలో నూతన టెక్నాలజీ తో పాటు రోగులకు ప్రత్యేక చొరవ చూసే డాక్టర్లు సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ లు ఉన్నారు.
