తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల): సిరిసిల్ల పట్టణంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కోసం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి యువతి, యువకులు హాజరయ్యారు. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రైవ్ లో 68 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన యువతి యువకులను కళాశాల ప్రిన్సిపాల్ దిడ్డి శ్రీనివాస్ అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి, కోఆర్డినేటర్స్ గాలి వేణు, బల్ల కిరణ్, డ్రైవ్ హెచ్ ఆర్ లు సంతోష్ కుమార్, వినయ్ అధ్యాపకులు పాల్గొన్నారు.
