పందుల స్వైర విహారం.. ఇళ్లలోకి వస్తున్న వైనం.. పట్టించుకోనీ అధికారులు

తెలంగాణ ప్రభ, (గంభీరావుపేట): గంభీరావుపేట మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదమరిస్తే ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. వ్యవహారం ప్రజలకు  తలనొప్పిగా మారడంతోపాటు ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు అసలు పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంభీరావుపేటలోని  14,15 వార్డులో పందులు, వీధి కుక్కలు తో జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు దోమల తో ఇబ్బందులు పడుతున్నారని మండల కేంద్రంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో గ్రామపంచాయతీ నుంచి పంచాయతీ కార్యదర్శి ఆదేశాలతో మురికి కాలువల్లో దోమలకు చెక్ పెట్టేందుకు చరియలు  అలాగే మండల కేంద్రంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఫైలేరియా అధికారులు ఫైలేరియా మందు పిచికారి కొట్టేవారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇటు గ్రామపంచాయతీ కార్యదర్శి కానీ అటు వైద్యాధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేరని ఇండ్లలో చిన్నపిల్లలు వృద్ధులు దోమల బెరడాతో టైఫాయిడ్ మలేరియా మరియు ఇతర వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. మండలంలోని ప్రతి ఇంట్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పందులు వీధి కుక్కలు మరియు దోమల వలన ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని పందులు మనుషులకు తాకు కుంటూ వెళ్తున్నాయని దోమల బెరడాతో ఇంత ఇబ్బంది పడినా కూడా గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు వైద్యాధికారులైన పట్టించుకోవడం లేరని ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కానీ ప్రజల సమస్యలపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

.