దివ్యంగులు అన్ని రంగాలలో రాణించాలి

మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను శుక్రవారం స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో ఘనంగా  నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. వైకల్యం అనేది శరీరానికి మాత్రమే కాని సంకల్పానికి కాదని, దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించేలా పట్టుదలతో ఉండాలని  అన్నారు.

దివ్యాంగులకు ఏదైనా సమస్యలు ఉన్న పరిష్కరిస్తామని తెలిపారు 

 దివ్యాంగులు  ఎందులోనూ  తక్కువగా ఉండకూడదని, అందరూ ప్రభుత్వ పతకాలను  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు, చెవిటి, మూగ, అంధత్వము గలవారికి ఈ నెల 13న నిర్వహించిన క్రీడాపోటీలలో పాల్గొన్న  విజేతలకు బహుమతులు  జిల్లా అదనపు కలెక్టర్ అందజేశారు.  

అంతకు ముందు ధ్యాన్ చంద్  చౌరస్తా నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ  బ్రహ్మాజీ,  ఏసీడీపీఓ, వెంకట రమణమ్మ, ఈఓ పద్మలత, దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు, జిల్లాలోని అన్ని గ్రామాల దివ్యాంగులు పాల్గొన్నారు.

.