విక్ సిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలి

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు

తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పౌసుమి బసు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్ చేరుకోవాలన్నదే విక్ సిత్ భారత్  సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్దేశం అన్నారు.

శుక్రవారం  కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులతో  విక్సిత్ భారత్  సంకల్ప్ యాత్ర పై పౌసుమి బసు 

జిల్లా కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలైన ఆయుష్మాన్ భారత్- పి ఎం జె ఏ వై, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం విశ్వకర్మ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC), పీఎం పోషన్ అభియాన్, హర్ ఘర్ జల్ - జల్ జీవన్ మిషన్,  సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైస్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్ ఏరియాస్(SVAMITVA), జన్ దన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, PM PRANAM, నానో ఫెర్టిలైజర్ పథకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

విక్సిత్ భారత్  సంకల్ప్ యాత్ర (కేంద్ర ప్రభుత్వ పథకాల) ప్రచార రథాలను ఈనెల 16న సాయంత్రం నాలుగు గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడి వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు. 

సంగారెడ్డి జిల్లాకు 10 (IEC  vans ) ప్రచార రధాలు కేటాయించారని, అట్టి వాహనాలలో ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ ఆడియో వీడియోతో ఉంటుందన్నారు.

ఈనెల 16 నుండి వచ్చే నెల( జనవరి) 25 వరకు ప్రతిరోజు ఒక్కో వాహనం రెండు గ్రామపంచాయతీలకు వెళ్తుందన్నారు.  అందుకు రూట్ మ్యాప్,యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని వెల్లాలన్నారు.

సంకల్ప్ యాత్ర విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. ఐటీ ప్లాట్ ఫామ్ లలో ప్రి - ఈవెంట్ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని కోరారు.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ  విక్సిత్ భారత్ సంకల్ఫ్ యాత్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 10 మొబైల్ వ్యాన్స్ వచ్చాయని, షెడ్యూల్ మేరకు ప్రతి వాహనం ప్రతిరోజు రెండు గ్రామపంచాయతీలను కవర్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థాయిలో ఒకరోజు ముందుగా టామ్ టామ్ చేసి ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సంబంధిత అధికారులకు సూచించారు. 

రిపోర్ట్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, డిఆర్ఓ నగేష్, ఎల్ డి ఎం గోపాల్ రెడ్డి, డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డీఎస్ఓ వనజాత, డిపిఓ సురేష్ మోహన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఇఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు, ఉద్యాన శాఖ డిడి వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక, ఫిషరీస్, డి డబ్ల్యు ఓ, బిసి, ఎస్సీ, కార్పొరేషన్ తదితర శాఖల జిల్లా అధికారులు, డివిజినల్ పంచాయతీ అధికారులు ఎంపీఓలు పాల్గొన్నారు.

.