గన్ తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చివేసి తాను కాల్చుకొని మృతి
సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామంలో విషాదం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. కలెక్టర్ గన్ మెన్ తన భార్య, పిల్లలను సర్వీస్ రివాల్వర్ తో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన వివరాలు ఇవి.
ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ (35) పీసీ నెంబర్ 2735 సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం అందాజా 11 గంటల సమయంలో తన స్వగ్రామం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో తన సర్వీస్ రివాల్వర్ తో భార్య ఆకుల చైతన్య (30), కొడుకు ఆకుల రేవంత్ (6), కూతురు ఆకుల రిషిత(5)ను గన్నుతో కాల్చి, తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆత్మహత్య గల కారణాలు తెలుస్తాయని సిద్దిపేట జిల్లా పోలీసులు తెలిపారు.
.