వైద్య చికిత్స కోసం రూ.20000/- ఆర్థిక సహాయం అందజేత

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): శాస్త్ర చికిత్స వికటించి మంచానికి పరిమితం ఐన ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రొడ్డ శ్రీకాంత్ అనే యువకుడికి మెరుగైన వైద్య కోసం డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం మండల కేంద్రంలోని కేరళ మోడల్ హై స్కూల్ యాజమాన్యం, బోధన, బోధనేతర సిబ్బంది కలిసి రూ. 20000/- ఆర్థిక సహాయం అందజేసి సేవ దృక్పదాన్ని కనబరిచారు. శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేందుకు అయ్యే వైద్య చికిత్సకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం కృష్ణ కుమార్, బిన్సీ, బోధన సిబ్బంది బాలకృష్ణ, నరేష్ రెడ్డి, బిజూ, ఘానీ, రాజేందర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

.