తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); భూ తగాదాలతో ఓ యువకుడి దారుణ హత్యకు గురైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లే గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సింహులపల్లే గ్రామంలో గత కొన్ని రోజులుగా ద్యాగ తిరుపతి మరియు ద్యాగ రాకేష్ వీరిద్దరి కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా భూతగాదా పంచాయతీ నడుస్తున్నందున రేపు ఉదయం స్థానికులు మాట్లాడదామని చెప్పగా సరే అని చెప్పి వెళ్లిపోయారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ద్యాగ తిరుపతి అనే వ్యక్తి తన పొలం వద్ద పనిచేస్తున్న ద్యాగ రాకేష్ పై గొడ్డలితో దాడి చేశాడు. ఇట్టి సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధితున్ని సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యం చేసిన వైద్యులు అప్పటికే చనిపోవడం జరిగిందని తెలపడంతో శవాన్ని పోస్టుమార్టం తరలించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
