వేదశ్రీ డిగ్రీ కళాశాలలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం రోజున వేదశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని ఆంజనేయులు ఆధ్వర్యంలో వేదశ్రీ డిగ్రీ కళాశాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గత సంవత్సరంలోని లోపాలను సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఏనుగుల శ్రీనివాస్,రమణ,రమేష్,శేఖర్, సురేందర్, భార్గవ్,గ్రీష్మ, రేష్మ తబస్సుం, అవంతిక పాల్గొన్నారు.

.