తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో):వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి దామోదర రాజనర్సింహాను సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ఇందూర్ గ్రామ కాంగ్రేస్ శ్రేణులు గురువారం మంత్రి నివాసం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటిసి వీణారాణి మహంకాళి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సాయిపేట మల్లేశం, నాయకులు మోహన్, తదితరులు పాల్గొన్నారు.
