జగిత్యాల డిఈఓ జగన్మోహన్ రెడ్డి
తెలంగాణ ప్రభ(ధర్మపురి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందించాలని జగిత్యాల జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.గురువారం ధర్మపురి పట్టణంలోని కస్తూరి భా పాఠశాల తో పాటు పలు పాఠశాలను ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ని పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశించారు.ప్రతి విద్యార్థి లక్ష్యం తో చదవాలని,గొప్ప వ్యక్తుల ను ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాడల్లో నడవాలని విద్యార్థుల కు సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి రికార్డు లో తనిఖీ చేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బత్తుల భూమయ్య,ప్రిన్సిపాల్ శ్రీలత,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
.