మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి..

ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి

మెదక్ న్యాయవాది ప్రశాంత్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలిపి ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని మెదక్ న్యాయవాది ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం మెదక్ పట్టణంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జోన్ లో కొనసాగుతున్న మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా తీసుకొచ్చిన 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత చర్యల వల్ల ఎంతోమంది నిరుద్యోగులు ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెషన్ లో ఈ అంశాన్ని ప్రస్తావించి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా జీవో విడుదల చేయాలని కోరారు.

ఈ సమావేశంలో చిరంజీవి, శ్రీకాంత్, ఈశ్వర్, భాను, వెంకటేష్, హరికాంత్ తదితరులు ఉన్నారు.

.