సంగారెడ్డి ఎస్పీని కలిసిన టిఎన్జీవో నాయకులు

ఎన్నికల విజయవంతంపై హర్షం

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో సంఘం తరపున టీఎన్జీవో ఎం.డి.జావిద్ అలీ అధ్యక్షతన గురువారం నాడు జిల్లా సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ చెన్నూరి రూపేష్ ను కలసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు  శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే 2024 టీఎన్జీవో డైరీ ముద్రణ కోసం ఎస్పీ సందేశాన్ని కోరడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి టీఎన్జీవోస్ భవనాలను, టీఎన్జీవోస్ ఆస్తులను కాపాడాల్సిందిగా కోరిన వెంటనే ఎస్పీ సానుకూలంగా స్పందించారని ఎండి జావేద్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వి.రవి,  అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి.వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కేంద్ర సంఘం మహిళా కార్యదర్శి నిర్మలా రాజకుమారి, కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాజా గౌస్ హష్మీ , విజయ్, శ్రీనివాస్, కొండల్, సుధామణి తదితరులు పాల్గొన్నారు.

.