తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు బుధవారం నాడు మెదక్ పట్టణంలో గల మహిళా జూనియర్ కళాశాలలో కళాబృందం, షీ టీం ద్వారా విద్యార్థులకు 100 డయల్ ఉపయోగము, సైబర్ నేరాలు అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్యవివాహల నిర్మూలన, విద్యార్థులు చెడు మార్గాన్ని విడనాడి సత్ ప్రవర్తనతో జీవించాలని తెలిపారు. అమ్మానాన్నాల విలువ తెలుసుకొని అనుకున్న లక్ష్యాని చేరుకొని సమాజంలో గౌరవంగా జీవించాలని కళాబృందం వారు పాటల ద్వారా మాటల ద్వారా మేజిక్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం కు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి విద్యార్థుల భవిష్యత్తుకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మంచి సూచనలు చేయడం జరిగింది.
