జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించిన సీసీఆర్ బృందం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టిఐ బోర్డులతో పాటు ఏసిబి అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీసీఆర్ జిల్లా అధ్యక్షుడు గుండ్ల శివ చంద్రం, మీడియా స్టేట్ కో ఆర్డినేటర్ సాజిద్ మాట్లాడుతూ పారదర్శక పాలన కోసం సీసీఆర్ సంస్థ పాటుపడుతుందని అన్నారు. సీసీఆర్ జాతీయ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించామన్నారు. ప్రజలకు అవినీతి నిరోధక శాఖపై అవగాహన కల్పించడానికి, తమ హక్కులను కాలరాసే ఆధికారులపై ఫిర్యాదు చేయడానికి తప్పకుండా ఏసీబీ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు, అదనపు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా అప్పటికప్పుడు ఫోన్ లో అధికారులతో మాట్లాడి ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్ లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో సీసీఆర్ సభ్యులు శివ, ఫారూఖ్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
