తెలంగాణ ప్రభ (ధర్మపురి): బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరామర్శించారు. హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రజా జీవితంలో అంకితం కావాలని కొప్పుల ఈశ్వర్ కోరుకున్నారు.
