సన్మానించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో డిగ్రీ, బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతున్న టి.శ్రీధర్ మానవత్వం చాటుకున్నారు.
నవంబర్ నెల 23వ తేదీన మెదక్ పట్టణంలోని ST బాయ్స్ హాస్టల్ దగ్గర మధ్యాహ్నం 2-3 గంటల మద్యన వివో ఫోన్ దొరికింది.
దొరికిన ఫోన్ తీసుకొని నేరుగా కలెక్టరు కార్యాలయానికి మిత్రులతో కలసి వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సాధారణ ఎన్నికల వల్ల అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. తిరిగి నవంబర్ 28వ తేదీన మళ్ళీ మిత్రులతో కలసి వచ్చినా
సిబ్బంది ఎలక్షన్ పనిలో ఉండడంతో వెనుదిరిగారు. బుదవారం నాడు శ్రీధర్ కలెక్టర్ కార్యాలయనికి వచ్చి
తనకు దొరికిన ఫోన్ ను జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
ఎంతో ఉపయోగకరంగా ఓపికతో, మానవత్వం చాటుకున్న విద్యార్థి శ్రీధర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శాలువాతో సన్మానం చేసి అభినందించారు. శ్రీధర్ కు దొరికిన ఫోన్ ను కలెక్టర్ పోలీస్ శాఖకు అందించి దర్యాఫ్తు చేసి బాధితులకు అందించాలని అధికారులను ఆదేశించారు.
.