సంగారెడ్డిలో పోలీస్ దర్బార్

ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలి

సిబ్బంది అవసరాలు తీరుస్తా

సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రజలతో మమేకమై క్రమశిక్షణతో ముందుకు సాగాలని, ప్రజలలో పోలీసు శాఖ ఇమేజ్ పెంచే విధంగా తమ విధులను నిర్వర్తించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బుధవారం సంగారెడ్డిలో పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు దర్భార్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని మాట్లాడారు.

 మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకొని, ప్రజలతో మమేకమౌతూ, క్రమశిక్షణతో ముందుకు సాగాలని,  పోలీసుశాఖ గౌరవాన్ని పెంచే విధంగా పని చేయాలని సూచించారు.

ఎట్టి పరిస్థితులలోనూ పోలీసుశాఖ ప్రతిష్ట, పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని దిగజారకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపైనే ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో (ఏ.ఆర్) సిబ్బంది సైతం కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

అనంతరం సాయుధ దళాల సిబ్బందితో మాట్లాడుతూ వారికున్న సమస్యలను అడిగి తెలుకొన్నారు. సిబ్బంది శ్రేయస్సు కోసం ఎల్లవేళలా ముందు ఉంటానని, వారి సమస్యలను వీలైనంత తొందరలోనే పరిష్కారిస్తానని అన్నారు.  ఇందులో భాగంగానే సిబ్బంది శ్రేయస్సు కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఎస్కార్ట్ సిబ్బందికి జైల్ వద్ద వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బి.డి టీం కోసం నూతన వాహనం మంజూరు, క్విక్ రియాక్షన్ టీం కు కొత్త యూనీఫార్మ్, షూస్, ఫుల్ ట్రావెల్లింగ్ అలవెన్సు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ మార్కెట్ తరహాలో క్యాంటీన్ ఆధునీకరణ చేయనున్నట్లు చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి, రివార్డ్లు, పతకాలు అందించడం జరుగుతుందన్నారు. సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు స్పోర్ట్స్ మీట్ తో పాటు 

శారీరకంగా దృఢంగా ఉన్న వారికి వి.ఐ.పి. పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. పి.యస్.ఒ. గా విధులు నిర్వహించే అధికారి ఎల్లవేళలా వి.ఐ.పి. రక్షణపైనే దృష్టి సారించాలన్నారు.  హోమ్ గార్డ్ సిబ్బందికి హెల్త్ కార్డు, యూనీఫార్మ్ అలవెన్సు, ఐ.డి. కార్డ్ లు అందించే  విధంగా చూస్తామని అన్నారు.  సిబ్బంది పైనాన్షియల్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలని, అనవసర వ్యసనాలకు పోయి ఇబ్బందులకు గురి కాకూడదన్నారు.   

 ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ పి.అశోక్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఎ.ఆర్. డియస్పి జనార్ధన్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివలింగం, ఐ.టి.సెల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, రామరావ్, హన్మి రెడ్డి, ఆర్. యస్.ఐ.లు, డిపిఒ సిబ్బంది, ఎ.ఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.