72 సిలిండర్స్ స్వాధీనం
సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించింది. ఐ.డి.ఎ బొల్లారం పోలీసు స్టేషన్ పరిధిలోగల మదీనగూడ గోడౌన్, శాంతి కాలనీలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ముగ్గురు పని వాళ్ళను చందా పాశ్వాన్, సూర్యకుమార్ అనే ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు కాగా అజయ్ అనే ఆటో డ్రైవర్ లను నియమించుకొని ప్రజలు గృహావసరాలకు వినియోగించే డోమెస్టిక్ గ్యాస్ ను అక్రమంగా కొనుగోలు చేసి, తన గోడౌన్ నందు రహస్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లకు రిఫిల్లింగ్ చేసి అధిక ధరకు విక్రయించడం జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని తెలిపారు. కమర్షియల్ హెచ్.పి భారత్ గ్యాస్ సిలిండర్స్ ఖాళీవి- 18, కమర్షియల్ భారత్ గ్యాస్ సిలిండర్స్ ఖాళీవి- 08, డోమెస్టిక్ హెచ్.పి గ్యాస్ సిలిండర్స్ ఫుల్ -36, వేయింగ్ మిషన్ -01, కొత్త రీఫిలింగ్ పైప్స్ -50, డెలివరి రిసీప్ట్స్, స్వాధీనపరుచుకొని, నిందితులతో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం ఐ.డి.ఎ. బొల్లారం పోలీసు స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
