మాజీ ఎంపీ ధీరజ్ సాహూ, రాహుల్ గాంధీల దిష్టిబొమ్మ దగ్ధం

అవినీతిపరుల ఆట కట్టించాలి

మెదక్ జిల్లా బీజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మాజీ ఎంపీ ధీరజ్ సాహూ వద్ద లభించిన అవినీతి సొమ్ముకు రాహుల్ గాంధీకి  చెప్పాలని డిమాండ్ చేస్తూ 

బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధీరజ్ సాహూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను మంగళవారం మెదక్ లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ..కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు వద్ద అవినీతి సొమ్ము 350 కోట్లు దొరికాయని, ఇంకా లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు.  రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరైన మిత్రుడు, సన్నితుడు అయిన ధీరత్ సాహు ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఇంత సొమ్ము దొరకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని,  ఈ విషయంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి అవినీతిపరులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో నల్లాల విజయ్, రఘువీరా రెడ్డి, ఏక్కలదేవి మధుసూదన్, గోడ రాజేందర్ యాదవ్, రమణ రావు, శ్రీనివాస్, తీగల శ్రీనివాస్, ప్రసాద్, ప్రభాకర్, శంకర్ గౌడ్, దయానంద్ రెడ్డి, సంతోష్ చారి, రంజిత్ రెడ్డి, రాజు, కల్కి నాగరాజు, రాహుల్, సన్నీ, బంటి తదితరులు పాల్గొన్నారు.

.