వైభవంగా రేణుకా మాతా అభిషేకం

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో): రేణుకా మాతను నమ్ముకుంటే  పనులన్నీ సఫలీకృతం అవుతాయని..పద్మ శివశివాని మురళీకృష్ణ, బొజ్జ పద్మ వెంకటరమణ  దంపతులు అన్నారు. అమ్మను నమ్ముకుని ఆశీస్సులు తీసుకోని చేసిన పనులు సత్ఫలితాలనుస్తాయని పేర్కొన్నారు.   మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవము అనంతరం 53వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దంపతులచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేక, అలంకరణ, అర్చన   కార్యక్రమం నిర్వహించగా  చల్లూరి కృష్ణ శర్మ, సాగరికల మంత్రోచ్ఛహరణల మధ్య ఘనంగా జరిపారు.  భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నదాన వితరణలో పాల్గొని   తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణ కృష్ణగౌడ్, ప్రభాకర్, రామకృష్ణ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్ , పాపగౌడ్, బొజ్జ సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, సంతోష్, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

.