మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ డి.సుధాకర్

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు

తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మద్యం సేవించి వాహనాలు నడిపితె కఠిన చర్యలు  తప్పవని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని తద్వారా సమాజానికి కీడు జరుగుతుందని ఆయన అన్నారు. సోమవారం రోజు ముస్కనిపేట రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన  ముస్కనిపేట  కు చెందిన వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే రోడ్లపై సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన  31 వాహనాల పైన రూ 4180/- జరిమానా విధించడం జరిగిందని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహనాల తనిఖీలలో ఏఎస్సై లు సంజీవరావు, మోతిరాం, హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు కుంట.శ్రీనివాస్,  శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

.