ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యం గా వ్యవహరించరాదు : జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ

మన ఊరు మనబడి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలి

అధికారులను ఆదేశించిన సిద్దిపేట  జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన సోమవారం జిల్లా పరిషత్తు 2,3,4 వ స్థాయి సంఘాల సమావేశాలు గ్రామీణ అభివృద్ధి , వ్యవసాయం , విద్యా -  వైద్యం అంశాలపై  జరిగాయి.

ఈ సందర్భగా జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా పని చేయాలని అధికారులకు సూచించారు.  అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆమె సూచించారు.

యాసంగి సీజన్ పంటలకు అవసరమైనటువంటి ఎరువులను  అందుబాటులో ఉంచాలని అన్నారు.  అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు అయ్యే విధంగా కార్యదర్శులు  పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. అదేవిధంగా పామ్ ఆయిల్ పంటల సాగు,  మల్బరీ పంటల సాగుపై చొరవ తీసుకొని సాగు విస్తీర్ణం పెరిగే దిశగా కృషి చేయాలని వ్యవసాయ అధికారికి సూచించారు.

అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పెండింగులో ఉన్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు, మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులు ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని సంబంధిత జిల్లా విద్యా అధికారికి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పిటిసిలు లక్ష్మి, కొండల్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ సలీం పాల్గొన్నారు.

.