ధర్మపురి ఎమ్మేల్యే లక్ష్మణ్ కుమార్
తెలంగాణ ప్రభ(ధర్మపురి) : ధర్మపురి నియోజక వర్గం ప్రజలకు శాసన సభ సమావేశాలలో తప్ప అనునిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని, సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ధర్మపురి శాసన సభ్యులు లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఆవరణలో మహాలక్ష్మి, చేయూత కార్యక్రమాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పుష్కర కాలం అనంతరం అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న
సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రజలకు సేవ చేయడం తమ ప్రధాన లక్ష్యం అన్నారు. అధికారులు
ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తేవాలని, ప్రతీ ఒక్కరికీ అందేలా అమలు పరచాలని అన్నారు. మహిళలకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసి బస్సులు ఎక్కవ సంఖ్యలో అవసరమైన
రద్దీ ఉన్న ప్రాంతాల్లో నడిపించాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయనున్న సందర్భంలో రెండు గ్యారంటీ లను ప్రకటించి అమలు చేస్తున్నదని, అందులో భాగంగా మహిళలు ఉచిత రవాణా, రాజీవ్ ఆరోగ్య శ్రీ లో 10 లక్షల వరకు వైద్య సేవలు పెంచడం జరిగిందని తెలిపారు. ప్రతీ మహిళా, ప్రతీ లబ్దిదారులు ఈ కార్యక్రమాలను సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం లో క్షేత్ర స్థాయి అమలుకు చాల ఇబ్బందులు ఎదురైనట్లు తన దృష్టి కి వచ్చిందని ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జీరో టికెట్, రాజీవ్ ఆరోగ్య శ్రీ పోస్టర్ లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్ లను అందించి, బస్సులో కొంత దూరం ప్రయాణం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మి నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, ఆర్టీసి డిపో మేనేజర్ సునీత, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి,
స్థానిక కౌన్సిలర్ లు, జక్కు పద్మ,అరుణ,ఎంపిడిఒ లు, సర్పంచులు, ఆశ, ఎఎన్ఎం లు, తదితరులు పాల్గొన్నారు.
.