ఆలయం వద్ద బారులుతీరిన భక్తజనం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఓం నమః శివాయ.. హర హర మహదేవ.. శంభో శంకర.. హరోం హర.. అనే శివ నామస్మరణతో శ్రీ భవానీ చిదంబర స్వామి శివాలయం మార్మోగింది. పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలోని శ్రీ భవానీ చిదంబర స్వామి శివాలయంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వేకువ జాము నుంచే వేడుకలు ప్రారంభం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు అమ్మన్నగారి కృష్ణాశర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, సుప్రభాత సేవ, పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ దీపారాధన, మహాన్యాసం తదితరులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.
50 మంది వేద పండితులచే మహా రుద్రాభిషేకం ఘనంగా ప్రారంభమయ్యాయి. శాస్ర్తోక్తంగా ఉదయం నుంచి సాయంత్రం 600 సార్లు మహా రుద్రాభిషేకాలు చేపట్టారు. రాత్రి నక్షత్ర హారతి తొలి రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అనంతరం అన్న దాన కార్యక్రమం నిర్వహించారు. రెండవ సోమవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో శాస్త్రుల రామకృష్ణ శర్మ, దేశాయి పేట అంకుశ్ శర్మ, కరణం పవన్ కుమార్ శర్మ, అభిలాష్ శర్మ, శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, కులకర్ణి పవనదత్తాసాయి శర్మ, దేశాయి పేట లింగమూర్తి శర్మ, వైద్య శ్రీనివాస్ శర్మ, సోమశేఖర రావు, హర్ష వర్ధన్ శర్మ, శ్రీవాండ్ల శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు నందిని శ్రీనివాస్, బద్రినాథ్, నగరం మల్లేశం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
.